Monday 6 August 2012

ఓ వెచ్చని ఙ్ఞాపకం - అనంతపురం


అన్ని చోట్లా క్లాక్ టవర్, ఇక్కడ మాత్రం టవర్ క్లాక్-అనతపురం టవర్ క్లాక్ సెంటర్


అనంతపురం.
కొత్తగా అక్కడికి వెళ్ళినవాళ్ళు ముందుగా గమనించేది-గుంతల రోడ్లు.
ఇంకా మురికి కాలువలు, మరికాస్త నిశితంగా చూస్తే లుంగీల్లో తాగుబోతులు.
బయటివాళ్ళకి (!?) అనంతపురం అంటే అంతేనేమొ.
మరి నాకు? 
..............................................
అ ...నం... త... పురం 

ఉప్పొంగే ఓ భావోధ్వేగం.  
చెరిగిపోని ఓ తియ్యని ఙ్ఞాపకం.
పెరిగే గుండె చప్పుడు.
ఎందుకంత ప్రత్యేకత?


తిరిగిరాదని తెలిసినపుడు గతాన్ని ఉన్నదానికన్నా ఘనంగా ఊహించుకుంటాం. అందువల్లనేనా?
కావచ్చు. కాని అదే పూర్తి కారణం కాదేమొ! 
నా జీవితంలో అక్కడ గడిపిన ఆ సమయానిదనుకుంటా, ఆ ప్రత్యేకత.  
17 సంవత్సరాల వయస్సు-ఉన్నట్లుండి ప్రపంచం పెద్దగా అయినట్లు ఓ కొత్త feeling.
కొత్త కాలెజ్, గంపెడు కలలు, కొత్త స్నేహలు, పలకరింపులు-మామ, బాబాయ్ (ఇన్ని కొత్తలుండబట్టేమొ, పాతూరు (Old town in Anantapur) కూడ కొత్తగా కనిపించింది. కనిపిస్తూనే వుంది. ఇక మీద కూడ అలాగే వుంటుంది అనుకుంటా! ) 
 ...................
ఇంకా అక్కడ చేసిన చిలిపి పనులు!
Oh, god!
జాగింగ్ కని పదహారు కిలోమీటర్లు పరిగెత్తుతూ బుక్కరాయ సముద్రం వెళ్ళడం (నిజానికి అంత దూరం వెళ్ళనవసరం లేదు. దారి సరిగా తెలియక ఓ 5కి.మి. లు ఎక్కువ పరిగెత్తాం).
ఎవరు చేస్తారు ఈ 'పిచ్చి ' పనులు? ఇంకెప్పుడన్నా చెయ్యగలమా? 
నడుములోతు నీళ్ళలో నాలుగు గంటలు ఈత! (కాలెజ్ వెనుక వున్న swimming pool లో)
చిన్న railway station ప్రసన్నాయపల్లి (కాలెజ్ కి దగ్గర్లో)- ఎంత పెద్ద relation! 
రివ్వున వీచే ఆ గాలిలొ, station లో వున్న బల్లపై కూర్చొని చదివిన గొప్ప పుస్తకాలు.
విశాలమైన ఆ నీలి ఆకాశానికి-Stephen Covey, Ayn Randల పుస్తకాల్లో భావాలకి ఎదో సంబందం ఉందనిపించేది.
వయస్సుతో సంబందం లేకుండా అక్కా, అన్నా అనే పిలుపులు (అనంతపురమంతటా!).

ఇక అంతపురానికే ప్రత్యేకమైన తిండ్లు-ఉగ్గాని, curd rice, జొన్న రొట్టెలు, ఓళిగలు. అన్నింటినీ మించి లస్సి సెంటర్ లొ లస్సి.
సాయంకాలం సూర్య కిరణాల్లో ఇస్కాన్ మందిర అందాలు.

ISKCON temple in Anantapur

ప్చ్.....అన్నీ గడిచిపొయాయ్.
ఇలాంటప్పుడే అనిపిస్తుంది-Life is a bitch అని. But actually its the other way around. ఇంకొక్క సంవత్సరం అక్కడే వుండుంటే, ఖచ్చితంగా అనంతపూర్ బోర్ కొట్టుండేది. 

కాలానికి అనుగుణంగా, ముందుకు వెల్లడమే మార్గం.
అలా కాకుండా గతంతో గట్టి బంధాలు ఏర్పరుచుకునేవాళ్ళకి ఈ తీయని గాయాలు తప్పవేమొ!