Friday 25 May 2012

"టూ ఫార్టీ"

అంతులేని ఆదర్శానికి మూలం: మా కాలేజ్-JNTU మెయిన్ బిల్డింగ్


"Fujitsu is the world's 3rd largest............." ఆపరేటర్ కాల్ని  హోల్డ్లో పెట్టడంతో, పక్క వింటూ ఇంకో పక్క డెస్క్టాప్పై ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ చదువుతున్నా. MBAలో బాగంగా సాఫ్ట్వేర్ కంపెనీ లో ఇంటెర్న్షిప్.............
"Are you there sir?"- మృధువైన అమ్మాయి కంఠస్వరం.
"Yes"
"Your extension number has been changed from one fifteen to two forty"
"Two forty!? You mean 25240?"-అప్రయత్నం గా చిరునవ్వు, అంతకన్నా ముందు ఆనందం కలిగాయి.
"Yes sir. Anything else?"
"Nothing. Thank you."- సారి అలవాటుగా కాకుండా, కావాలని  చెప్పాను.
                                               ***************************
Place: సెమినార్ హాల్, మెకానికల్ డిపార్ట్మెంట్, JNTU అనంతపూర్.
Date: 27 సెప్టెంబర్, 2007.

".............. నంబర్ ని బాగా గుర్తు పెట్టుకోండి. ఇది మీ
అడ్మీషన్ నంబర్ అండ్ రోల్ నంబర్ ఆల్సొ. ఇందులో ఫస్ట్ టూ డిజిట్స్ 07  మీ ఇయర్ ని.........." -మెకానికల్ డిపార్ట్మెంట్ హెడ్ మాట్లాడుతున్నాడు.
"జీరో  సెవెన్  జీరో  జీరో  వన్    జీరో  టూ  ఫోర్  జీరో"- కింద ఉన్న అడ్మీషన్ ఫాం ని చూస్తూ వేళ్ళపై లెక్కపెట్టా. మొత్తం పది అంకెలు.
"What the f***! Such a long code to my ass?"- చిరాకేసింది, నంబర్లు గుర్తు పెట్టుకోవడంలో కాస్త వీక్.   

మీటింగ్ తర్వాత క్లాస్లోకి వెళ్ళాం.మెయిన్ బిల్డింగ్లో రూం నంబర్ 172. పురాతన వస్తుశాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడినట్లున్నాయ్, బెంచ్లు. 1945లో పెట్టారు మరి కాలేజ్ని! ఎంతమంది గొప్పవాళ్ళు కుర్చున్నారో క్లాస్లో, ఇవే బెంచ్లపై.పాత బిల్డింగ్, పాత క్లాస్, పాత బెంచెస్ కానీ అంత కొత్తదనమే!    
ఇంతలో పరిచయాల ప్రోగ్రాం మొదలైంది. ఇందాక ఇచ్చిన నంబర్లో  లాస్ట్ మూడు డిజిట్స్ వరుస ప్రకారం ఒకొక్కరు నించొని వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్  చేసుకుంటున్నారు. 201,202,203............ 
పక్కవాళ్ళని పరిచయం చెసుకోవడం, నా వంతు వస్తే ఎం చెప్పాలా అని ఆలోచన, చెప్పేవాళ్ళు ఎలా చెబుతున్నారో గమనించడం, ఆపైన అటుపక్క కుర్చున్న అమ్మాయిల్లో ఎవరైన బాగున్నారా అని జిల్ జిల్ జిగ (మొదటి రోజు మరి!)...........
ఇంతలోనే 239 దాకా వచ్చింది.  
""షేక్ మహమ్మద్ రిజ్వాన్, ఫ్రమ్ అనంతపూర్. ఇంటర్ ఇన్ శ్రీసాయి కాలేజ్."- రిజ్వాన్ !, ఎలారా పలికేది!?
ఒకే, ఇట్స్ మై టర్న్ నౌ (ఎందుకని గుండె ఇంతలా కొట్టుకుంటుంది?) .
" .................................. ఫ్రమ్ సూర్యాపేట్, నల్గొండ డిస్ట్రిక్ట్. డిడ్ మై ఇంటర్ ఫ్రమ్ విశాఖ డిఫెన్స్ అకాడెమీ, గాజువాక, విశాఖపట్నం"- చెప్పి కుర్చుని, హమ్మయ్య అనుకున్నా.
                                                           ******************
అమరావతి హాస్టల్. మెస్ రెజిస్టర్లో  పేరు ఎంటర్ చెయ్యాలి
"నంబర్ ఎంత?" - మెస్లో కుర్చున్న వ్యక్తి అడిగాడు. (అతని పేరు ప్రసాద్ అని తర్వాత తెలిసిందితర్వత్తర్వాత బాగా పరిచయం అయ్యాడు.)
"ఏం నంబర్?"
""రూల్ నంబర్"
"అడ్మీషన్ నంబర్ ?"
"హుఁ"
వెంటనే రూమ్ లోకి వెళ్ళి, పది అంకెల నంబర్ ని ఒక స్లిప్పై రాసుకుని పరిగెత్తుకుంటూ వచ్చా పోటుగాడిలా.  
""జీరో సెవెన్ జీ....."
"లాస్ట్ మూడు అంకెలు చాలు"
వార్ని. అదేదో ముందే చెప్పి తగలడొచ్చుగా!
""టూఫార్టీ"
"ఇక్కడ సైన్ చెయ్"- పక్క అల్రెడి నా నంబర్ రాసి ఉంది.
                                                    *****************
తర్వాతి రోజూ ఇంట్రడక్షన్లే. ఈపాటికి అర్థమైంది, రూల్ నంబర్ ఎంత అవసరమో. వచ్చిన రెండో రోజు అమరావతికి వెళ్ళే దారిలో ఒక సీనియర్‌కి దొరికిపోయాం.
" బ్రాంచ్ రా?"
"EEE సర్"
"EEE ఏంది బే  _కా?"
"Electrical and Electronics Engineering సర్"
"నంబర్ ఎంతర?"-కసురుకున్నట్లు అడిగాడు.
"240 సర్
"240 ఏందిరా _____గా? ఎంత కొవ్వు రా నీకు!? పూర్తిగా చెప్పు." -పుట్టి బుద్ది ఎరిగిన నాటి నుండి, ఎవరూ తిట్టనన్ని బండ బూతులు తిడుతున్నడనే ఉక్రొశం, మొదటి సారి ర్యాగింగ్ వల్ల కలిగిన ఉద్వేగం, ఇంకా కారణం తెలియని నవ్వు ( అది బయటికి కనపడకుండా విశ్వ ప్రయత్నం).
" జీరొ సెవెన్ జీరొ వన్ జీరొ టు ఫోర్ జీరొ
" ఏంటే? ఇంకోసారి చెప్పు?"
"0701A0240"
" చేరి రెన్...డు రోజులైంది (అదేదో 200 రోజులైనట్లు!), ఇంకా నంబర్ కూడ తెలియదు బే?"- ప్రపంచంలో   ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకేం వుండదేమొ అన్నట్లు ఫేస్లో  ఎక్స్ ప్రెషన్. నిజంగా ఇది అంత ఘోరమైన తప్పా? అయ్యే ఉంటుంది. ! వెదవ జీవితం, ముఖ్యమైనవి తప్ప అన్ని విషయాలూ గుర్తుంటాయ్.        
ఇంతలో దూరంగ వాచ్ మన్ విజిల్.
"రేయ్ 240, నువ్వు నంబర్ సరిగా నేర్చుకుని, 500 సార్లు దాన్ని రాసి కనిపించ్రా. ఇక దొబ్బెయ్యండి"- (నిజానికి అన్న గారు వాడిన చివరి పదం ఇంకాస్త అచ్చ తెలుగు!)
బతుకు జీవుడా అనుకుని హస్టల్కి పరిగెత్తా. వెళ్ళగానే చెసిన మొదటి పని- 07001A0240,
07001A0240,
07001A0240,
07001A0240
..................
రాత్రి హస్టల్లో సరదా సంభాషణ మధ్య తెలిసింది, ప్రతీ ఒక్కడికి వాడి నంబర్ సీనియర్ హెల్ప్ చెస్తాడట ( రకమైన హెల్ప్ అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం, అక్కడిదాక అసలు ఆలొచన వెల్లలేదు- సాదారణంగా కొత్తగా కాలెజీ లొ చెరిన వారికి ఎవరికీ వెల్లదు). నాలుగు సంవత్సరాల సీనియర్స్ లోనూ సేం నంబర్ ఉన్న వాళ్ళు క్లోజ్గా ఉంటారట, చిన్నపాటి ఫ్యామిలీలా! సో, ఇదన్నమాట సీనియర్ నంబర్ అడగటానికి కారణం.
             *****************************************************************
        రోజులు గడుస్తున్నాయ్. మొదటిసారి   EDC ల్యాబ్ కి వెళ్ళాం, పాత   డిపార్ట్మెంట్లో. నా బ్రాంచి పేరులో ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి ఇది కూడ నాదే అన్న ఫీలింగ్తో  అడుగు పెట్టా. అక్కడికి వెళ్ళాక ముగ్గురు, ముగ్గురుగా బ్యాచెస్ చేశారు- రూల్ నంబర్ల ప్రకారం. 239, 240, 242. ! ఇదీ సంగతి. నాలుగు సంవత్సరాలు నాయాల్లతొ (238, 239, 242) గడపాలన్నమాట! మొదటి సారి నంబర్కి  ఉన్న పవర్ లీలామాత్రంగా కన్పించింది ( సంగతి ముందే తెలిస్తే ఎంత బాగుండురా!).
క్లాస్లో సగం మందిని (మొదటి 25 నంబర్స్) first batch అని, రెండో సగాన్నిsecond batch అని విడదీసారు. అగ్ర కులం-అధమ కులం, ధనిక-పేద, పట్టణ ప్రజ-పల్లె ప్రజ, సీనియర్-జూనియర్, ఫస్ట్ బ్యాచ్-సెకండ్ బ్యాచ్....................... సాయి రాం, ఏంటయ్యా విభజన?
రోజు సాయంత్రం హస్టల్లో............                                                
201-రవిందర్
202-సతీష్
203-రవి మొహన్ 
...............
................
వీడు (242 రాజేష్) ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నాడు? జస్ట్ నిన్ననే కదా ఇద్దరు సీనియర్లు క్లాస్లో అందరి నంబర్లూ గుర్తుపెట్టుకోమని ఆర్డర్ జారీ చెసారు. వీడప్పుడే అన్నీ పిడేసాడు- పిడి నాయాల. CR గా వుంటె కాస్త లీడర్షిప్ లక్షణాలు వస్తాయనుకున్నా, ఇలా అందరి నంబర్లు బట్టి కొట్టాల్సి వస్తుందనుకోలెదు
                                                 *************
"నంబర్ ఎంత బె?"- కాస్త సెక్యూరిటి తగ్గడంతో సీనియర్స్ అమరావతి పై దండయాత్ర చెసారు.
"240" (ఇప్పుడు రోజులు మారాయ్. మొత్తం వినేంత ఓపిక లేదు)
"S.D చెప్పు"-Self Description. ఇప్పటికి వంద సార్లు చెప్పుంట. అయినా నా గురించి నేను చెప్పుకోవడంలో ఏదో ఆనందం ఉంది- అది బయట పడకుండా సీనియర్ ముందు ఎడుపుగొట్టు ముఖం వేసుకుని మొదలుపెట్టాను. ర్యాగింగ్ జరిగేప్పుడు అడిగే ఒక కామన్ ప్రశ్న-"నీ సీనియర్ ఎవరు?" మన సమాధానాన్ని బట్టి తర్వాతి ప్రశ్న-తెలియక పోతే తిట్లు, తెలిస్తే 'తెలియదు సార్ అని చెప్పేదాక ప్రశ్నలు-3rd ఇయర్ సీనియర్ ఎవరు, ఫైనల్ ఇయర్ సీనియర్ ఎవరు, passed out సీనియర్ ఎవరు............. ఎలా తెలిసేది? ఒకరిద్దరికి తప్ప ఎవరికీ సెకండ్ ఇయర్ సీనియర్ కూడా తెలియదు. "తెలుసుకో బే" అని అరుస్తారు. అడక్కముందే క్లూ కూడ ఇస్తారు- నీ సీనియర్ క్రికెట్ బాగా ఆడతాడు, టాపర్, స్టేజ్పై చించేస్తాడు, కేక, రచ్చ, తురుం, ఇనుం.......................ఇన్ని చెప్పినప్పుడు పేరేదో చెప్పొచ్చు కదా! ఊహు, లేదు. మేమే కనిపెట్టాలి
ఇంకొన్ని రోజులు ర్యాగింగ్ జరిగేసరికి నేనూ, రాజెష్ (242) గాడు తీర్మానానికి వచ్చాం- మమ్మల్ని ఇద్దర్నీ కల్పి మాటిమాటికీ ర్యాగింగ్ చెసే ఇద్దరూ మా సీనియర్లు అయ్యుంటారు. ఎవరు ఎవరికి సీనియర్ అనేది ఇంకా మిస్టరీనే!
ఒక రోజు C ల్యాబ్ రెజిస్టర్లో రాజెష్ గాడు సీనియర్ల పేర్ల లిస్ట్ చూసాడు. వార్త సెకండ్లలో క్లాస్ అంతటికీ పాకింది. కాసేపట్లో అందరూ వాళ్ళ వాళ్ళ సీనియర్ల పేర్లని ఇంకొకరికి చెప్పి సంబర పడుతున్నారు.
నా సీనియర్ పేరూ దొరికింది.
కనక రాజు.
పేరు పక్కా మాస్గా ఉంది. ముందు వేసిన అంచనా ( ఇద్దరిలో ఒకడు) తప్పై ఉండొచ్చు.
                                                 *************
అమరావతి హస్టల్ పక్క గ్రౌండు. (క్యాంపస్ గోడ దూకితే, రోడ్డు అవతల పక్కన వుంటుంది. కాలేజ్ గ్రౌండ్కి first years వెల్లడం నిషిద్దం.)
సూర్యాస్తమయ సమయం
మిగతా జూనియర్లని తోలుకురమ్మని డేస్కాలర్ అభినవ్(218) గాడిని హస్టల్ కి పంపారు. ఇప్పటికి నా సీనియర్ పేరు తెల్సింది, కానీ పర్సన్ ఇంకా తెలియదు.
సీనియర్లంతా గోడపై కూర్చున్నారు. సాదారణమైన ర్యాగింగే- పెంపుడు కుక్కని ఆడించినట్లు వాళ్ళు బాల్ని దూరంగా విసరడం. కుక్కలకన్నా హుషారుగా మేం పరుగెత్తడం. మారే రోజులతొ పాటే ర్యాగింగ్ కూడా మారింది- కష్టపడే దశ నుండి, ఇష్టపదే దశ దాకా. ఇంతలో ఇయర్ఫోన్స్ సీనియర్ (పేరు వీరవిహార్ అని తర్వాత తెలిసింది) అభినవ్ గాడితో కొత్తగా వచ్చిన చార్మి సినిమా లోని పాటకి డ్యాన్స్ వేయించాడు. అది చూసి ఆనందిస్తుంటే, "అరేయ్  240, నువ్విటు రార"- ఇంతకుముందు రెగ్యులర్గా ర్యాగింగ్ చేసే సీనియర్లలో ఒకతను పిలిచాడు ( పాటికి ఇతని పేరు సిద్దు అని, నంబర్ 242 అని తెలిసింది).
"బుక్స్ అడిగావా నీ సీనియర్ని? నీ సీనియర్ ఎవరో తెల్సుకోవా?"
"ఎలా అన్నా? ఎవర్ని అడిగినా ____ భే అంటున్నారు. మీరన్నా చెప్పండి."
"ఇంకెవర్రా? మెమిద్దరం కలిసి ఎన్నిసార్లు ర్యాగింగ్ చెసాం రా?"
"థాంక్స్ అన్నా"
నా అనుమానం నిజమైంది.
అన్నని పలకరించడం, రెండు మూడు పేద్ద క్లాస్లు, వారసత్వంగా వచ్చిన పుస్తకాలు, అనసూయ సినిమా, అటుతర్వాత మొత్తం B.Tech లైఫ్ గురించి అన్న ఙాన ప్రబోదం, ఇంతలో Get Together పార్టీ.....................
                                          *****************
వేసవి. అనంతపురం వేడి, అమరావతి హస్టల్ ముందు చెట్లకు ఎరుపు రంగు పూలు, హస్టల్లో నీటి కొరత, మేడపై నిద్దురలు........................
మొదటి IPLతో పాటు, Exams కూడా వచ్చాయి. ఇక్కడ హల్ టికెట్ నంబర్ కూడా సేం నంబర్. ముందు 241, వెనక రిజ్వాన్ గాడు. ముందు 241 ఎడిషన్ల మీద ఎడిషన్లు. దీని జీవిత చరిత్ర కానీ రాస్తుందా పేపర్లలో? నా పక్కన ఉన్న అమ్మాయి (229) నుంచొని రాయడం చూసి రోజు సాయంత్రం store keeper తో గొడవ
పక్కన 49 రాజేష్ (ఇద్దరు రాజేష్ లు ఉండటం తో 49 రాజెష్, 42 రాజేష్ అని పిలవడం పరిపాటి).  
ఇంత నిర్భయంగా ఉండటం ఎలా సాధ్యం?
8 సబ్జెక్ట్లు, నాలుగు ల్యాబ్లు.
మొత్తానికి మొదటి సంవత్సరం పూర్తి చెసాం.
                                                           ***************
నిరంతరం సూర్యరశ్మితో, చురుగ్గా ఉందే అమరావతి నుండి పాత బడిన గోడలు (ఏదొ ప్రపంచ యుద్ధంలొ సైనికులు బుల్లెట్లతో చెసినట్లు లెక్కలేనన్ని రంద్రాలు వాటికి), మద్యలో చెట్లతో నిండి ఉండే అజంతా హస్టల్ కి మారిపోయాం. ,
  
Now we are seniors! మరి సీనియర్స్ అన్నాక ప్రతాపం చూపించటానికి జూనియర్స్ కావాలి కదా! సెప్టెంబర్ వచ్చేసింది. అయితే మా కన్నా భారీ సెక్యూరిటీ తో దిగారు మా జూనియర్లు. ఎలా నాయాల్ల తాట తీయడం? (ఫస్ట్ ఇయర్లో  Applied Physics-పద్మజా రాణి మేడం క్లాస్లో చెప్పినట్లు గానే జరిగింది. అప్పుడు  ర్యాగింగ్ చెయ్యమంటే చేయ్యం అన్న వాళ్ళం, ఇప్పుడు చెయ్యడనికి సేఫ్ ప్లేస్లు వెతకడంలొ తలమునకలై వున్నాం.)
అవకాశం వచ్చింది. Official freshers party. బయట వేట కుక్కల్లా వేచి చూస్తున్న మా నుండి జూనియర్లని కాపాడటనికి కాపలాకాస్తున్నారు, కాలేజీ యజమాన్యం. ఎలగబ్బా సైనిక వలయాన్ని చెదించడం?...........................
అది ఆడిటొరియం. జూనియర్లంతా ముందు వరుసల్లో కూర్చున్నారు. వాళ్ళ వెనక కొంతమంది వర్కర్స్ తర్వాత వీళ్ళని ర్యాగింగ్ చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న కొంతమంది సీనియర్లు. ఇలా అయితే లాభం లెదు. వెంటనే వెనుకాల డోర్ నుండి కాకుండా, మెయిన్ డోర్ నుండి ఎంటర్ అయ్యా. అక్కడ స్ట్రెయిట్గా కాపలా కాస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి,   
"సర్, వెనకన వాళ్ళని కంట్రోల్ చెయ్యడం కష్టంగా ఉంది, ఇంకో ఇద్దర్ని అక్కడికి పంపుదాం."- విషయాల్లో నేనె నీకంటే పెద్ద expertని అన్నట్లు పైకి గాoభీర్యం, పడతాడా-పడేసి తంతాడా లోపల భయంతో కూడిన అనుమానం!
"నువ్వే ఇయర్?"- సాయిరాం!! అడక్కూడదనుకున్న ప్రశ్న అడిగేసాడు.
"Anti Ragging Squad సర్, సెకండ్ ఇయర్"- అదొకటి ఉందని ఫస్ట్ ఇయర్లో విన్నా.
"అయితే నువ్వు వెనక్కి వెళ్ళు."
హుర్రే! గొర్రెల గుంపులోకి (జూనియర్లు కదా!) కాపలదారి తోడేలుని పంపినట్లనిపించింది. ఇక పండగే పండగ...................
నేను వెళ్ళడమే కాదు, మా బ్యాచ్ని కూడా పిలిచా, గొర్రెల గుంపు పైకి. ఇలా ఎంజాయ్ చెస్తుండగా పురుష్ (228) మామ అరిచాడు/పిలిచాడు.
"రేయ్ వీడి నంబర్ 240 అంట"
"240 ?"
"అవున్సార్."
"పేరు?"
"సోమకేశవులు"
" ఊరు బే?"
..........................
వీన్ని చూస్తే అనుమానించలేనంత అమాయకుడిలా ఉన్నాడు. వీడన్నమాట కొత్త వారసుడు.
"నువ్విటు రార"
కాసేపు మాట్లాడి, మా వాళ్ళ కంటపడని చోట కూర్చొబెట్టి వచ్చాను.

ర్యాగింగ్ సీజన్ జోరందుకుంది. పర్సంటేజ్లో కాకపోయినా, క్లాస్ పీకడంలో నా సీనియర్ కన్నా రెండు ఆకులు ఎక్కువే తిన్నాను. నా జూనియర్ని  తీసుకెళ్ళి లైబ్రరీ లో నాకు వేద వాక్కుల్లాంటి పదాల్ని చదివించాను.
(The heights by ........................................... strove hard, Day and Night)
కాలేజ్ అంతా తిప్పి మొత్తం B.Tech లైఫ్పై నాకే తెలియనంత చెప్పా. లెక్కలేనన్ని సలహాలు, సూచనలు. అంతసేపు కాకపోయినా తర్వాత కూడా ఇదే పద్దతి కొనసాగింది
( మద్యనే ఫోన్ చేసి చెప్పాడు, GATEలో 312 ర్యాంక్ వచ్చిందని. బహుశా నేను గర్వంగా ఫీల్ అవుతానని వాడికి తెలుసు అనుకుంటా!)
                                      **********   
మా క్లాస్లో వాళ్ళ నంబర్లే కాదు, నంబర్లకి (Admission no./roll no./Hall ticket number or just number) ఎంత craze అంటే మిగతా బ్రాంచెస్ వాళ్ళ నంబర్లు కూడా తెలిసేవి
ఆయా వ్యక్తులని బట్టి నంబర్లకి గుర్తింపు, నంబర్లని బట్టి వ్యక్తులకి గుర్తింపు.
టీవీ యాడ్లో AXE ఎఫెక్ట్లా, నంబర్ ఎఫెక్ట్కి అందరూ పడిపోవాల్సిందే- కొన్ని సార్లు ఒకే రకం నంబర్లున్న గ్రూప్కి పేర్లు కూడ-202,212,222,232,242: Palindrome series( సిరీస్ గెట్ పార్టీ పెడతామని కూతలు కూసేవాల్లు 232 & 242), 30 సిరీస్-కరువు బ్యాచ్ (మొత్తం సిరీస్ లో ఒక్క అమ్మయి కూడ లేదని!), 40 సిరీస్-నేనూ, నా బెస్ట్ ఫ్రెండ్స్ వుండేవాళ్ళు కాబట్టి ఇదే రచ్చ సిరీస్ అని నా ప్రగాఢ విశ్వాసం, 232,233,234-రూంమేట్స్, నంబర్ 50 (లాస్ట్ నంబర్), నంబర్ 1 (మొదటి వాడు- ఎగ్జాం అయినా ఫస్ట్ ఫేస్ చెయ్యాల్సిన వాడు), email idలని నంబర్ వచ్చెట్లుగా క్రియేట్ చేసుకునే వాళ్ళం, సెకండ్ఇయర్కి వచ్చేసరికి అందరూ వాళ్ళ సెల్ నంబర్లో లాస్ట్ మూడు అంకెలు వాళ్ళ నంబర్ వచ్చేట్లు చూసుకునే వాళ్ళు, అలాగే క్లాస్మేట్ల ఫోన్ నంబర్లని పేర్లకు బదులు నంబర్ తో సేవ్ చెసుకునే వాళ్ళం (చాలామంది ఇప్పటీకీ ఇలానే చెస్తారు!), క్రికెట్ మ్యాచ్ చుసేప్పుడు మా నంబర్ స్కోర్ వస్తే ఉత్కంఠ-పక్క నుండి అరుపులు!  

ఇలా నాలుగు సంవత్సరాలు నంబర్లు మాకు రెండో పేరులా పనిచేసాయి. మా JNTU జీవితం లో విడదీయని బాగం అయిపొయాయి.